ఏలూరుజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ శాశ్వత భవనానికి భూమిపూజా
1 min read
రాష్ట్రమంత్రి కొలుసు పార్థసారధి, టీడిపి జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్యే బడేటి చంటి,దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని,ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: సాధారణ కార్యకర్తే అసలైన అధినేత అని నమ్మే సిద్ధాంతం కలిగిన తెలుగుదేశం పార్టీ నిర్మాణాత్మక విధానాలను మరింత ప్రణాళికాబద్ధంగా, పటిష్టవంతంగా అమలు చేసేందుకు నూతన ఆలోచనాలతో ముందుకెళ్తున్నామని రాష్ట్ర సమాచార, గృహనిర్మాణ శాఖామంత్రి కొలుసు పార్థసారధి, టీడిపి జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. అధునాతన అడుగులు, మెరుగైన వ్యూహాలతో పార్టీని క్షేత్రస్థాయి నుండి దృఢపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటున్నామని వారు వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు ఎక్కడ చూసినా అధునాతన విధానాలు అత్యావశ్యకం అయ్యాయి. తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న తమ రాజకీయా పార్టీకి సైతం ఇదే ఫార్ములాను అమలు చేయాలని నిర్ణయించారు తెలుగుదేశం పార్టీ అధినేతలు. అందుకు అనుగుణంగా, అనుకున్నదే తడవుగా తగిన చర్యలకు ఉపక్రమించడంతో ఆ విధానాలు యుద్ధప్రాతిపదికన అమలుకు నోచుకుంటూ వస్తున్నాయి. దీనిలో భాగంగానే ఏలూరులో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ శాశ్వత భవనానికి సోమవారం భూమిపూజా కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. జిల్లా పార్టీ రథసారధి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార, గృహనిర్మాణ శాఖామంత్రి కొలుసు పార్ధసారధి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, జెడ్పి చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, నగర మేయర్ షేక్ నూర్జహాన్ తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. నిర్ణయించిన ముహూర్తంలో భూమిపూజా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నేతలు,,, శంకుస్థాపనా క్రతువును ఎంతో వేడుకగా పూర్తిచేశారు. అందర్నీ నవ్వూతూ పలకరించిన ఆయన,,, ప్రతీఒక్కర్నీ కలుపుకెళ్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్రమంత్రి నారా లోకేష్‌ల ఆకాంక్షలకు అనుగుణంగా కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడపడంలో ముఖ్యభూమిక పోషించారనే చెప్పాలి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ, మాజీ ఎమ్మెల్సీ కమ్మెల విఠల్, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీను, కైకలూరు ఇన్ఛార్జ్ నరసింహారావు, పార్టీ పరిశీలకురాలు ఉన్నమట్ల సునీత, రాష్ట్ర మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, జిల్లా పార్టీ మీడియా కో-ఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, ఎఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి ఉప్పాల జగదీష్‌బాబు, పలువురు కార్పొరేటర్లు, క్లస్టర్ ఇంచార్జిలు,డివిజన్ ఇంచార్జీలు, వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


