అక్రమ అరెస్టులకు భయపడేది లేదు..
1 min read
వైఎస్ఆర్సిపి కర్నూల్ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి
వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో భారీ ధర్నా
కర్నూలు, న్యూస్ నేడు : కర్నూలు యువజన విభాగ నాయకుడు బాలుని కర్నూలు 3వ పట్టణ పోలీసు వారు అక్రమంగా అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్తే అతను పోలీసుల బెదిరింపులకి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు.మొన్న ఒక యువకుడు తన ఆత్మహత్య సుసైడ్ నోట్ లో ఐటీడీపి కర్నూలు జిల్లా అధ్యక్షుడి పేరు రాస్తే ఇంత వరకు అతని మీద ఎలాంటి చర్యలు లేవు.. అతని మీద కేసు పెట్టలేదు.. కానీ దాని మీద ఒక పోస్ట్ పెట్టడానికి సన నరసింహ అనే వైస్సార్సీపీ కార్యకర్తని తెల్లవారుజామున అరెస్ట్ చేసి తీసుకెళ్తారు ఎలాంటి కంప్లైంట్ లేకుండా తప్పుడు కేసులు పెడుతూ, పోలీసులని అడ్డు పెట్టుకొని టీడీపీ ప్రభుత్వం వైస్సార్సీపీ శ్రేణులని అనగాతొక్కాలని చూస్తున్న టీడీపీ రెడ్ బుక్ కి వ్యతిరేకంగా కర్నూలు లో వైస్సార్సీపీ ధర్నా కార్యక్రమం నిర్వహించింది .కార్యక్రమంలో వైస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా, జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి , రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి , కర్నూలు మాజీ శాసన సభ్యులు హఫీజ్ ఖాన్ , కోడుమూరు నియోజకవర్గ సమన్వయ కర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి , కోడుమూరు నియోజకవర్గం ఇంచార్జి డా. ఆదిమూలపు సతీష్ , కర్నూలు అబ్సర్వర్ చల్లా విగ్నేశ్వర్ రెడ్డి , కర్నూలు నగర అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్ , రాష్ట్ర యువజన విభాగ ఉపాధ్యక్షులు కాటసాని ఓబుల్ రెడ్డి , బుట్టా ప్రతూల్ , పార్టీ రాష్ట్ర నాయకులు , అనుబంధ విభాగ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కూటమి ప్రభుత్వానికి వైస్సార్సీపీ నాయకులని ఎంత తొక్కాలని చూస్తే అంత బలంగా తయారవుతారని హెచ్చరిక జారీ చేశారు.


