NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యం : వైకుంఠం జ్యోతి

1 min read

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి, పరిశుభ్రతే ప్రధాన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కట్టుబడి పనిచేస్తోందని ఆలూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి పేర్కొన్నారు.స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆమె ఆలూరు మండల కేంద్రంలోని “వెల్త్ ఫ్రమ్ వేస్ట్ సెంటర్” (చెత్త నుండి సంపద తయారీ కేంద్రం) ను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.కేంద్రంలో చెత్తను తడి, పొడి వ్యర్థాలుగా వేరు చేసి, వాటి ద్వారా సేంద్రియ ఎరువులు మరియు ఉపయోగకరమైన వస్తువులను తయారు చేసే విధానాన్ని ఆమె స్వయంగా పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పరిశుభ్రమైన గ్రామాల నిర్మాణానికి ఇటువంటి కేంద్రాలు ఎంతో అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడిన వైకుంఠం జ్యోతి , కేంద్ర నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని, ప్రజల్లో చెత్త నిర్వహణపై అవగాహన పెంచాలని సూచించారు. ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉంటేనే స్వర్ణాంధ్ర సాధ్యమవుతుందని ఆమె తెలిపారు.ప్రజలు కూడా పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె పిలుపునిచ్చారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *