NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

14 వ తారీఖు ఎస్.ఐ.ఆర్ ప్రక్రియకు చివరి రోజు

1 min read

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం

ఎస్‌.ఐ.ఆర్ ప్రక్రియ కు రాజకీయ పార్టీలు, ప్రజలు పూర్తి సహకారం అందించాలి

జిల్లా ఎన్నికల అధికారి/ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి

కర్నూలు, న్యూస్​ నేడు : ఎస్‌.ఐ.ఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ గడువు 14 వ తారీఖున ముగుస్తూ ఉన్నందున పారదర్శకంగా, సమర్థవంతంగా పూర్తి చేయడానికి రాజకీయ పార్టీలు, ప్రజలు పూర్తి సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి/ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి రాజకీయ పార్టీ ప్రతినిధుల సమావేశంలో కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్‌ఐఆర్ ప్రక్రియ నిర్వహణపై సమావేశం నిర్వహి నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక నాలుగు రోజులలో గడువు ముగుస్తూ ఉన్నందున రాజకీయ పార్టీల బిఎల్వోలు సహకరించి ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలని రాజకీయ పార్టీలను జిల్లా ఎన్నికల అధికారి కోరారు.  ఎన్యుమరేషన్ ఫారాల లక్ష్యాన్ని నిర్దేశించుకుని పంపిణీ , స్వీకరణ కార్యక్రమం క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రతి అర్హుడైన ఓటరు వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రాజకీయ పార్టీలు తమ తరఫున బూత్ లెవల్ ఏజెంట్లను (బీఎల్‌ఏలు) నియమించి, బూత్ స్థాయిలో ఎస్‌.ఐ.ఆర్ ప్రక్రియకు సహకరించాలని కలెక్టర్ కోరారు. బి ఎల్ ఓ మరియు బీఎల్‌ఏల సహకారంతో ఓటర్ల వివరాల పరిశీలన, అర్హుల గుర్తింపు, అవసరమైన సవరణలు మరింత సమర్థవంతంగా జరుగుతాయని తెలిపారు. రేపు రెండవ శనివారం, ఆదివారం రోజుల్లో కూడా జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు) అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు నేరుగా తమ పోలింగ్ కేంద్రానికి వెళ్లి బీఎల్‌ఓల వద్ద నుంచి ఎన్యుమరేషన్ ఫారాలను తీసుకుని, 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ చేసుకుని , పూర్తి వివరాలతో, ఫోటోలతో ఫారాలను నింపి తిరిగి సమర్పించాలని సూచించారు.బిఎల్ఓ లకు సహకరించడానికి   డ్వామా , అంగన్వాడి మొదలగు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.ఈ సమావేశానికి డిఆర్ఓ వెంకటనారాయణమ్మ , ఎలక్షన్ సెల్ సూపరిండెంట్ మురళి , బిజెపి పార్టీ ప్రతినిధి సాయి ప్రదీప్ , తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు ఎల్వి ప్రసాద్ , మధు బాబు నాయుడు , జనసేన పార్టీ తరపున మంజునాథ్ , బహుజన సమాజ్ పార్టీ తరపున అరుణ్ కుమార్ , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఎస్. ఏ.షరీఫ్ మరియు అంజి , కమ్యూనిస్టు పార్టీ తరపున గౌస్ దేశాయ్ , ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున లాజరస్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *