NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ మండల కమిటీ ఏకగ్రీవం..

1 min read

చాగలమర్రి , ( న్యూస్ నేడు ): మండల కేంద్రమైన చాగలమర్రిలోని ఆర్.సి.యం స్కూల్ మైదానంలో శుక్రవారం ఏఐటీయూసీ అనుబంధ సంస్థ అయినా అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ మండల కమిటీ ని టీచర్లు హెల్పర్స్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ ఏర్పాటు చేయడానికి పరిశీలకులుగా జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షురాలు చంద్రకళ హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల కమిటీ ఏర్పాటు చేయడానికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. సంఘ నియమ నిబంధనలు తెలియజేశారు. చాగలమర్రి మండలం అధ్యక్షురాలుగా హసీనా, ఉపాధ్యక్షురాలు హసానమ్మ, వహీదా, ప్రధాన కార్యదర్శి కాకి సుజాత, సహాయ కార్యదర్శి శ్రీలక్ష్మి, కోశాధికారి ఇందుమతి, సభ్యులు మోక్షవతి, మాబుచాన్, ఓబులమ్మ, మై మూన్, తదితరులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. హెల్పర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా మచ్చ గుర్రమ్మ, ఉపాధ్యక్షురాలు జ్యోతి, దీప, కోశాధికారి మా బు చాన్ , సుధారాణి, సభ్యులు పద్మావతి, దిల్షద్, కేజియా, లక్ష్మీదేవి, తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *