NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాస్తిహరినాథ్ బాబు బృందావనం పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

1 min read

ప్రారంభించిన కార్పొరేటర్ నాయుడు సోమేశ్వరరావు శారద దంపతులు

కీర్తిశేషులు సప్పరపు చిన కోటిలింగం పుల్లమ్మ జ్ఞాపకార్థం, కుమారుడు ఎస్.కె సత్యనారాయణ ఆర్థిక సహాయం

సుమారు 5,000 మందికి  మజ్జిగ పంపిణి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జాస్తిహరినాథ్ బాబు బృందావనం పార్క్ వాకర్స్ అసోసియేషన్ పత్తేబాద,ఏలూరు వారి ఆధ్వర్యంలో కీర్తిశేషులు సప్పరపు చిన కోటిలింగం పుల్లమ్మ  జ్ఞాపకార్థం వారి కుమారుడు ఎస్.కె సత్యనారాయణ ఆర్థిక సహాయంతో 37 వ డివిజన్ కార్పొరేటర్ నాయుడు సోమేశ్వరుడు (సోము) శారద  ఆధ్వర్యంలో 5,000 మందికి  మజ్జిగ పంచడం జరిగినది.ఏలూరు ప్రజల వేసవి దాహార్తిని తీర్చడానికి అందరికి ఉపయోగపడే విధంగా  ప్రతి ఆదివారం  మజ్జిగ, ద్రాక్షరసం మరియు రస్న మొదలగున్నవి పంచడం జరుగుచున్నది.ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ మరకా భుజంగరావు,కార్యదర్శి పోతన మురళి కృష్ణ, కోశాధికారి దుర్గాప్రసాద్ ఎస్ వి ఎన్ ఎన్, ఐ. ఎం.ఆర్.మోహన్ రావు,పిచ్చుక సోమరాజు,మరకా శివయ్య,  నార్ని అనిల్ కుమార్, మాడా మల్లిఖార్జునరావు,నూకల తిరుమల రావు, ఎస్.కె.సత్యనారాయణ, ఏనుగుల శ్రీనివాస్, రాపేటి మధు, వెంకట్ , మజ్జి రాజేంద్రప్రసాద్, భూపతి రాజు,కె.సూర్యకాంతం, కొల్లా సత్యవతి,జె.శ్రీనివాస్ , శశిధర్, తిడా సత్యనారాయణ మరియు వాకర్స్ సభ్యులు పాల్గొనడం జరిగింది.

About Author