NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ,ఇరిగేషన్ స్థలాల ఆక్రమణలను కూటమి ప్రభుత్వం ప్రోత్సహించదు

1 min read

ప్రతి పేద వాడికి శాశ్వత ఇంటి చిరునామా మేము ఇస్తాం,

దర్జాగా జీవించేలా చేస్తాం

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెల్లడి

ఆక్రమణల వల్ల అభివృద్ధి పనులకు తీవ్ర ఆటంకం,ప్రజా హితం కోసమే ఈ నిర్ణయo

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రజా హితాన్ని కాంక్షిస్తూ, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్  స్పష్టం చేశారు. ఆదివారం దుగ్గిరాలలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నిత్య ప్రజా దర్బార్’ లో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలు, డ్రెయిన్లు, వంటి ఆక్రమణలపై ఎమ్మెల్యే గారు ప్రజలకు ఒక కీలకమైన సూచన మరియు చేశారు.ఆక్రమణలు శాశ్వతం కావు ఎమ్మెల్యే చింతమనేనిఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలు, డ్రైన్లు, ఇరిగేషన్ (సాగునీటి శాఖ) స్థలాలను ఆక్రమించటం సరికాదని సూచించారు. అటువంటి వివాదాస్పద లేదా ప్రభుత్వ ప్రాంతాల్లో నివాసాలు, వ్యాపార సముదాయాలు వంటివి ఏర్పాటు చేసుకోవాలని చూస్తే అవి ఎప్పటికీ శాశ్వతం కావని, ఏదో ఒకరోజు వాటిని వదిలి వెళ్లాల్సిందే అనే నిజాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఆక్రమిత స్థలాల్లో జీవిస్తే ఏ రోజు ఏ అధికారులు వచ్చి ఇళ్లను తొలగిస్తారో అనే భయాందోళనలతో ప్రతి నిత్యం గడపాల్సి వస్తుందని” ఆవేదన వ్యక్తం చేశారు.అభివృద్ధికి ఆటంకంఈ ఆక్రమణల వల్ల గ్రామాల్లో డ్రైన్ల (మురుగు కాలువల) నిర్వహణకు, రహదారుల విస్తరణకు మరియు ఇతర ప్రభుత్వ అభివృద్ధి పనులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యే చింతమనేని పేర్కొన్నారు. ప్రజా క్షేమాన్ని పణంగా పెట్టి చేసే ఇటువంటి ఆక్రమణలను కూటమి ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించదని ఆయన కరాఖండిగా తేల్చి చెప్పారు. కావున ఈ అంశాన్ని అర్థం చేసుకుని ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

పేదవాడి సొంత ఇంటి కల మా బాధ్యత: నిజమైన పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ప్రభాకర్ భరోసా ఇచ్చారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం తరపున ఉచితంగా ఇంటి స్థలాన్ని కేటాయిస్తామని ప్రకటించారు. అలా లభించిన సొంత స్థలంలో ఎటువంటి ఆందోళన, భయం లేకుండా ప్రశాంతంగా, శాశ్వతంగా జీవించవచ్చని తెలిపారు.క్యాంపు కార్యాలయంలో జరిగిన నిత్య ప్రజా దర్బార్ లో నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి వచ్చిన  ప్రజల సమస్యలను ఎమ్మెల్యే పరిశీలించారు. రెవెన్యూ, ఉపాధి, వ్యక్తిగత సమస్యలపై అందిన అర్జీలను పరిశీలించి, తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు, పలువురు  అధికారులు  పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *