గోపూజతో ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు
1 min read
ఆదోని , న్యూస్ నేడు: ఆదోని పట్టణం, వసంత టాకీస్ సమీపంలోని శ్రీ రుక్మిణి పాండురంగస్వామి దేవస్థానం నందు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు శుక్రవారం వత్ససహిత గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో ముగిసినవి. ప్రతిరోజు ఇస్కాన్ ధర్మప్రచారకులు నిత్యతృప్తదాస్ చేసిన ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలిచే నిర్వహించిన భజన కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ అధ్యక్షులు మహేంద్రకర్ లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు జె. ఈశ్వరరావు, కార్యదర్శి జవేల్కర్ బాబురావు, సంయుక్త కార్యదర్శి జె. వెంకటేశ్వరరావు, కోశాధికారి పతంగి నరసింగరావు, వడే రఘు, సూత్రవే ఆనంద్, సరోదే వెంకోబరావుతోపాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


