NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను సమగ్రంగా, పారదర్శకంగా నిర్వహించాలి

1 min read

ప్రతి అర్హత కలిగిన ఓటరు వివరాలు ఖచ్చితంగా నమోదు కావాలి

జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి

కర్నూలు, న్యూస్​ నేడు: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి అధికారులను ఆదేశించారు.విజయవాడ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌కు సంబంధించిన కార్యాచరణ, కాలపట్టిక, విధివిధానాలపై సమగ్ర సూచనలు జారీ చేశారు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి మాట్లాడుతూ… ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరు జాబితా సవరణ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా అమలు చేయాలని తెలిపారు. ప్రతి అర్హత కలిగిన ఓటరుకు ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. రాజకీయ పార్టీలతో సమన్వయం కీలకం ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో డీఈఓలు, ఈఆర్‌ఓలు కాలానుగుణంగా సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ఈజూలై 21 నుండి ఆగస్టు 20 వరకు క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ స్వీకరణ జరుగుతుందని, వాటి పరిష్కార ప్రక్రియ జూలై 21 నుండి సెప్టెంబర్ 18 వరకు కొనసాగుతుందని తెలిపారు. తుది ఓటరు జాబితాను సెప్టెంబర్ 22న ప్రచురించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి దశలో పారదర్శకత పాటిస్తూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి / జిల్లా కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో డీఆర్వో వెంకటనారాయణమ్మ, జిల్లా పరిషత్ సీఈవో వెంకటరమణారెడ్డి, నియోజకవర్గ ఎన్నికల అధికారులు కర్నూలు- మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేష్,కోడుమూరు – ఆర్డీవో సందీప్ కుమార్, పత్తికొండ- ఆర్డీవో చిన్న ఓబులేసు, ఆలూరు -హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఎస్‌డీసీ రామసుబ్బయ్య, మంత్రాలయం- ఎస్‌డీసీ అనురాధ, ఆదోని & ఎమ్మిగనూరు ఇన్‌చార్జ్ ఆర్డీవో మధుసూదన్, ఎలక్షన్స్ సెల్ సూపరింటెండెంట్ మురళి తదితరులు పాల్గొన్నారు.

About Author