NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వర్గీయ ఎన్టీఆర్ కు ఘన నివాళి

1 min read

కర్నూలు న్యూస్ నేడు : ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB) ప్రాంతీయ కార్యాలయం కర్నూలు కార్యాలయ ప్రాంగణంలో  గురువారం తెలుగు జాతి గర్వకారణమైన మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)  జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి ఈ ఈ కిషోర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, తెలుగు సంస్కృతి అభివృద్ధి మరియు ప్రజాసేవలో ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తు చేశారు.నందమూరి తారక రామారావు  విశిష్ట సేవలను గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన జయంతిని రాష్ట్ర వేడుకగా ప్రకటించింది.ఈ కార్యక్రమంలో ప్రాంతీయ కార్యాలయం, కర్నూలుకు చెందిన  ఏ ఈ రామకృష్ణ,  అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

About Author