NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

29న  ఆళ్లగడ్డలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

1 min read

“వన్ మంత్ – ఫోర్ విజిట్”లో భాగంగా ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం

నంద్యాల, న్యూస్​ నేడు:”వన్ మంత్ – ఫోర్ విజిట్” కార్యక్రమంలో భాగంగా ఈనెల 29వ తేదీ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఆళ్లగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో కలిసి  ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు హాజరై ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతారని కలెక్టర్ వివరించారు. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *