NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండుగ వేడుకలు

1 min read

మంత్రాలయం  న్యూస్ నేడు : త్యాగానికి  ప్రతీక ఈదుల్ జుహ (బక్రీద్) పండుగ ను ముస్లిం సోదరులు గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రాలయం లో జామియా మసీదు నుండి మాధవరం రోడ్డు లో ఉన్న ఈద్గ వరకు ముస్లిం సోదరులు ర్యాలీ గా వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడ జామియా మసీదు పేష్ ఇమాం ఖాజాబందేనవాజ్ బక్రీద్ యొక్క విసిష్ట గురించి ప్రసంగించి , నమాజ్ చేశారు. అనంతరం ఒకరినొకరు ఈద్ ముబారక్ అంటు ఆలింగనం చేసుకున్నారు. చిన్నారులు సైతం ఆలింగనం చేసుకున్నారు. అక్కడి కి వచ్చిన వారికి దాన ధర్మాలు చేశారు. దీంతో పండుగ వాతావరణం నెలకొంది. అలాగే మండలంలోని మాలపల్లి, సుంకేశ్వరి, తుంగభద్ర, రాంపురం, సింగ రాజనహళ్లి, మాధవరం, వగరూరు, సూగురు, తిమ్మాపురం, తదితర గ్రామాల్లో బక్రీద్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *