NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహానాయకుడు శ్రీ ఎన్టీఆర్ కి ఘన నివాళులు

1 min read

సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ శ్రీ యం. మహేష్ కుమార్

జిల్లా పోలీసు  కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు..

కర్నూలు, న్యూస్​ నేడు:  మహానాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు  జయంతి సందర్భంగా గురువారం కర్నూలు  జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మే 28వ తేదీని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో, కర్నూలు  ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపీఎస్  ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సదరన్ రీజియన్  హోంగార్డు కమాండెంట్  శ్రీ యం. మహేష్ కుమార్   ఎన్టీఆర్  చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సంధర్భంగా సదరన్ రీజియన్  హోంగార్డు కమాండెంట్  శ్రీ యం. మహేష్ కుమార్  మాట్లాడుతూ… తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మహానాయకుడు శ్రీ ఎన్టీఆర్  ప్రజాహిత పరిపాలనకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రజలకు అందించిన సేవలు, ఆయన పరిపాలనా దక్షత, తెలుగు సమాజానికి చేసిన విశిష్ట సేవలను ఈ సందర్భంగా గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో హోంగార్డు డిఎస్పీ ప్రసాద్,  ఆర్ ఐలు నారాయణ, పోతల రాజు,  ఆర్ ఎస్సైలు , ఎఆర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

About Author