NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉత్సాహంగా ముగిసిన ‘వర్చువల్ మహానాడు’

1 min read

కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..మాండ్ర

నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో 11 క్లస్టర్లలో వర్చువల్ విధానంలో ‘మహానాడు-2026’ రెండు రోజుల కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా ఉదయం నుండి సాయంత్రం దాకా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యవర్గ సభ్యులు మాండ్ర శివానందరెడ్డి పలు మహానాడు కార్యక్రమాలకు హాజరయ్యారు.మిడుతూరు మండలంలోనిఉప్పలదడియ గ్రామంలో జరిగిన మహానాడు కార్యక్రమానికి గురువారం ఎమ్మెల్యే గిత్త జయసూర్య హాజరు మహానాడు కార్యక్రమాన్ని తిలకించారు. సాయంత్రం మిడుతూరు మండల క్లస్టర్-4 ఇన్చార్జి కమతం రాజశేఖర్ రెడ్డి వివిధ గ్రామాల నాయకులను  శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి, శివరామిరెడ్డి,సర్వోత్తమ్ రెడ్డి,మాజీ సర్పంచ్ నాగేంద్ర,సుంకేసుల భూపాల్ రెడ్డి,యరభం ప్రమోద్ రెడ్డి, వీరారెడ్డి,ఇద్రిస్,సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

About Author