NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రేమకు ప్రతీకగా బక్రీద్ పండుగ

1 min read

ప్రభుత్వ ఖాజీ జాకీర్ హుస్సేన్..

మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో గురువారం ప్రేమకు ప్రతీకగా  బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని మిడుతూరు, మాసపేట,కడుమూరు, తలముడిపి,జలకనూరు, చెరుకుచెర్ల తదితర గ్రామాల్లో భక్తి శ్రద్ధల నడుమ పండుగను జరుపుకున్నారు.ముస్లిం సోదరులు,చిన్నారులు నూతన దుస్తులు ధరించి ఈద్ గాల దగ్గర ప్రత్యేకంగా ఉదయం నుండే ప్రార్థనలు నిర్వహించారు.తర్వాత పిల్లలకు ప్రేమకు నిలయంగా పేదలకు సహాయం చేయాలనే దృఢ సంకల్పంతో పేదలకు సహాయం చేశారు.ఈద్ ముబారక్ శుభాకాంక్షలు అంటూ ముస్లిం సోదరులు కౌగిలించుకుంటూ ప్రేమను పంచుకున్నారు. ఉప్పలదడియ గ్రామంలో  ఈద్ గాలో మిడుతూరు మండల ప్రభుత్వ ఖాజీ షేక్ జాకీర్ హుస్సేన్ బక్రీద్ పండుగ గురించి వివరించారు.బక్రీద్ పండుగ అంటే ప్రేమకు నిలయంగా ప్రేమను పంచుకోవాలని ఆపదలో ఉన్న వారికి తమ వంతుగా ఆదుకోవడమే ఖురాన్ ప్రవక్త ముఖ్య ఉద్దేశమని అన్నారు.ఈ కార్యక్రమంలో సుల్తాన్,దౌలత్ భాష,సుల్తాన్ సాహెబ్,ఆర్టీసీ అబ్దుల్ రవూఫ్,అతావుర్ రహిమాన్,షాకీర్ భాష తదితర ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

About Author