NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సోలార్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించిన హైకోర్టు జడ్జీ

1 min read

వినికిడి యంత్రాలను పంపిణీ హైకోర్టు,జిల్లా జడ్జీలు..

నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ‘పల్లె ప్రియాంక సేవా సమితి’ అధ్యక్షులు రిటైర్ జిల్లా జడ్జి పి.మోహన్ రావు సౌజన్యంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పట్టణంలోని పగిడ్యాల రోడ్డులో శ్రీ కాళీ ప్రసాద ఆశ్రీతాశ్రమంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు మరియు ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య  అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ. హరిహర నాదశర్మ మరియు కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.ఖబర్థి హాజరయ్యారు.అదేవిధంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, నందికొట్కూరు సీనియర్ సివిల్ జడ్జి ఏ. శోభారాణి,జూనియర్ సివిల్ జడ్జి వి.దివ్య హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో జడ్జిలు కార్యక్రమాన్ని ప్రారంభించారు.    ఈ సందర్భంగా జడ్జీలు  మాట్లాడుతూ పల్లె ప్రియాంక సేవా సమితి కార్యక్రమాలను కొనియాడారు.ఈ సందర్భంలో వినికిడి లోపం ఉన్నవారికి వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు.ఇలాంటి అవకాశాలను ప్రజలు వినియోగించుకోవాలని ఈనెల 4వ తేదీన వినికిడి యంత్రాల కోసం అసెస్మెంట్ తీసుకున్నవారికి యంత్రాలను పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు.శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ విజయనగరం,శాంతిరాం మెడికల్ కాలేజ్ నంద్యాల బృందం సహకారంతో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.తర్వాత సర్విశెట్టి వేణుగోపాల్ శెట్టి మరియు రమేష్ బాబు 5 లక్షలతో నిర్మించిన 12 కెడబ్ల్యూపి సోలార్ పవర్ ప్లాంట్ ను జడ్జీలు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్  శ్రీనివాసులు,డాక్టర్ చైతన్య రెడ్డి,సన్మార్క్ సేవా సమితి ప్రెసిడెంట్ నాగన్న మరియు బృందం,పారా లీగల్ వాలంటీర్లు శోభారాణి, చిన్నరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *