డిజిటల్ మహానాడు లో 2వ రోజు పాల్గొన్న నాయకులు కార్యకర్తలు
1 min read
కౌతాళం, న్యూస్ నేడు: కౌతాళం మండలం పరిధిలో కార్యక్రమం నిర్వహించగా ఉరుకుంద, హాల్వి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డిజిటల్ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరుపుకున్నారు.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు చూడి ఉల్లిగయ్య డిజిటల్ మహానాడులో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన తెలుగు తమ్ముళ్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హాల్వి లో జరిగిన డిజిటల్ మహానాడు కార్యక్రమంలో కౌతాళం మండల అధ్యక్షులు సురేష్ నాయుడు, అడివప్ప గౌడ్, కుంభలూరు క్యాంప్ చిన్న పట్టాభి, నాగేశ్వరరావు మారుతి చౌదరి కాత్రికి చంద్ర, ఉరుకుంద డిజిటల్ మహానాడులో పాల్గొన్న తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం సీనియర్ నాయకులు చెన్న బసప్ప ధని,శివ మోహన్ రెడ్డి, కొట్రేష్ గౌడ్, సుధీర్ రెడ్డి, సతీష్ చౌదరి, కురుగోడు, దొడ్డన గౌడ, రమేష్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సోమన్న, రాజబాబు, సిద్దు, చిరంజీవి, మంజు, మండల నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తుగా పాల్గొన్నారు.

