కుమారుడి అవయవదానంతో ఇతరుల జీవితాల్లో వెలుగులు
1 min read
మంత్రాలయం న్యూస్ నేడు : రోడ్డు ప్రమాదంలో తమ కుమారుడి బ్రైన్ డెడ్ కావడంతో ఇక తమ బిడ్డ తమ నుంచి భౌతింకంగా దూరమవుతున్నాడని తెలిసిన తల్లిదండ్రులు ఇతరుల జీవితాల్లో నైనా వెలుగులు నింపుదామని భావించిన తల్లిదండ్రుల దయార్ద హృదయాలతో మానవత్వం చాటుకున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు కు చెందిన విద్య పోగుల సుమాల లలిత విద్య పోగుల చంద్ర పాల్ లు వృత్తి రీత్యా ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. లలిత మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని పెద్ద కడుబూరు గ్రామంలోని బసలదొడ్డి గ్రామంలో, చంద్రపాల్ మంత్రాలయం మండల పరిధిలోని మాలపల్లి గ్రామంలో విధులు నిర్వహిస్తున్నారు. వీరి కుమారుడు విద్య పోగుల లికీ ప్రభాస్ పాల్ (22)ఎఐటికె కడపలో కంప్యూటర్ సైన్స్ లో బిటెక్ పూర్తిచేసుకుని ఉద్యోగాన్వేషణ చేస్తున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా బొమ్మ సముద్రం దగ్గర గత నెల 26 వ తేదీన జరిగిన బైక్ ప్రమాదంలో తలకు తీవ్రమైన గాయం కావడంతో బ్రెయిన్ డెడ్ అయింది. కుమారుడు తమకు ఇక లేడని భావించి కావడము తో వేలూరు సిఎంసి హాస్పటల్లో అవయవ దానము చేయడం జరిగినది. వీరు గొప్ప మనసుతో కుమారుడు తమతో లేకపోయినా కుమారుని అవయవాలు( కళ్ళు, మూత్రపిండాలు, కాలేయము, గుండె నాళాలు) దానము చేయడం ద్వారా పదిమంది జీవితాలలో వెలుగులు నింపి అనేకమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. లికీ ప్రభాస్ పాల్ జ్ఞాపకార్థము నందికొట్కూరు సాయిబాబా పేట లో స్వగృహమునందు 03-06-2026 వ తేదీ (బుధవారము) ఉదయము 10 గంటలకు ఆదరణ సమావేశం జరుగును. ఈ సమావేశమునకు బంధువులు శ్రేయోభిలాషులు మిత్రులు అందరూ హాజరు కావలసినదిగా తల్లిదండ్రులు కోరారు.


