ప్రజారోగ్య నిపుణుల తయారీకి పీహెచ్ఎఫ్ఐ-ఐపీహెచ్ఎస్
1 min read
హైదరాబాద్, న్యూస్ నేడు : దేశంలో ఆరోగ్య రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నైపుణ్యం కలిగిన ప్రజారోగ్య నిపుణుల కొరత ప్రధాన సవాల్‌గా మారిందని పీహెచ్ఎఫ్ఐ-ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సైన్సెస్ (పీహెచ్ఎఫ్ఐ-ఐపీహెచ్ఎస్) వెల్లడించింది. సంస్థ అంచనాల ప్రకారం దేశానికి ప్రస్తుతం 45 వేలకుపైగా అదనపు ప్రజారోగ్య నిపుణులు అవసరమన్నారు. ఆసుపత్రులు, వైద్య మౌలిక వసతులు పెరుగుతున్నప్పటికీ ఆరోగ్య వ్యవస్థలను సమర్థంగా నిర్వహించే నిపుణుల సంఖ్య తగినంతగా పెరగడం లేదని పేర్కొంది.ఇటీవల డీమ్డ్ టు బీ యూనివర్సిటీ హోదా పొందిన పీహెచ్ఎఫ్ఐ-ఐపీహెచ్ఎస్ ప్రజారోగ్య విద్య, పరిశోధన, విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపింది. దేశంలో మారుతున్న ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (MPH), మాస్టర్ ఆఫ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ (MHA), ఎంఎస్సీ ఇన్ వన్ హెల్త్, ఎంఎస్సీ ఇన్ డిజిటల్ హెల్త్ అండ్ డేటా సైన్స్ కోర్సులను అందిస్తోంది.వ్యాధుల నిఘా, ఆరోగ్య విధానాలు, డిజిటల్ హెల్త్, ఆరోగ్య ఆర్థిక శాస్త్రం, కమ్యూనిటీ ఆరోగ్యం వంటి అంశాల్లో విద్యార్థులకు ప్రాయోగిక శిక్షణ అందిస్తూ ప్రభుత్వ, వైద్య సంస్థలు, అంతర్జాతీయ సంస్థల్లో నాయకత్వ బాధ్యతలు చేపట్టేలా తీర్చిదిద్దుతున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, భువనేశ్వర్‌లలోని క్యాంపస్‌ల ద్వారా భావి ప్రజారోగ్య నాయకులను తయారు చేయడమే తమ లక్ష్యమని వెల్లడించారు.


