NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

1 min read

జూన్ 4 నుంచి 12 వరకు వైఎస్సార్‌సీపీ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపు

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచన

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బుసినే విరూపాక్షి గారు “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి గారు మాట్లాడుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జూన్ 4 నుంచి 12 వరకు నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలను ఆలూరు నియోజకవర్గంలో విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, మేనిఫెస్టోలో పేర్కొన్న అనేక వాగ్దానాలను విస్మరించి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల విశ్వాసానికి విరుద్ధంగా వ్యవహరించిన ప్రభుత్వ వైఖరిని ప్రజలకు వివరించాలని ప్రతి కార్యకర్తకు సూచించారు.జూన్ 4 నుంచి 12 వరకు నిర్వహించే కార్యక్రమాల్లో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.కార్యక్రమాల వివరాలు:జూన్ 4: మండల కేంద్రాల్లో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సంతకాలతో విడుదలైన హామీ పత్రాలు, సంబంధిత పత్రికా ప్రకటనల ప్రతులను దహనం చేసే కార్యక్రమం.జూన్ 8, 9: నియోజకవర్గ కేంద్రాల్లో “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో టౌన్ హాల్ సమావేశాలు నిర్వహించడం. జూన్ 12: చంద్రబాబు రెండేళ్ల పాలనకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టడం.ఈ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసి, ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి  పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *