రాయపాటి శ్రీనివాస్‌కు అంతర్జాతీయ అంబాసిడర్ గుర్తింపు
1 min read
కర్నూలు,న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ సామాజిక సేవకులు, శాంతి పరిరక్షణ మరియు మానవ హక్కుల ప్రచారకర్త డాక్టర్ రాయపాటి శ్రీనివాస్‌కు అర్జెంటీనా సంస్థ తరఫున అంబాసిడర్‌గా గుర్తింపు లభించింది. సంస్థ జారీ చేసిన అధికారిక గుర్తింపు పత్రం ప్రకారం, భారత జాతీయతకు చెందిన రాయపాటి శ్రీనివాస్‌ను అంబాసిడర్‌గా నియమిస్తూ BIHFFF/ARG/26/034గుర్తింపు సంఖ్యను కేటాయించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, మానవ గౌరవం, స్వేచ్ఛ, మానవ హక్కుల పరిరక్షణ వంటి ఆశయాలను ప్రోత్సహించడం ఈ సంస్థ గుర్తింపు పత్రంలో ప్రధానంగా పేర్కొనబడింది. ఈ గుర్తింపుతో అంతర్జాతీయ స్థాయిలో శాంతి, సామాజిక న్యాయం, మానవ హక్కులపై అవగాహన పెంపొందించేందుకు మరింత కృషి చేయడానికి అవకాశం లభించిందని భావిస్తున్నారు. సమాజంలో శాంతి, సామరస్యం, సమానత్వం, మానవతా విలువలను విస్తృతంగా ప్రచారం చేయడానికి కృషి చేస్తానని అవార్డు గ్రహీత తెలిపారు.


