విద్యార్థుల భోజనం శుభ్రంగా ఉండాలి:ఎంఈఓ
1 min read
వంట నిర్వాహకులకు శిక్షణ..
మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం శుభ్రంగా తయారు చేయాలని మిడుతూరు ఎంఈఓ-2 మల్లికార్జున నాయక్ అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం మండలంలో ఉన్న మధ్యాహ్న భోజన వంట నిర్వాహకులకు మరియు సహాయకులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన మెనూ రోజుల వారీగా భోజనం,కర్రీ, సాంబార్ తదితర వాటి గురించి మెనూ బోర్డులో ఉన్న విధంగా తప్పనిసరిగా విద్యార్థులకు అందించాలని అన్నారు.మెనూ పాటించక పోతే కఠిన చర్యలు తప్పవని వంట నిర్వాహకులకు హెచ్చరించారు.వంట పాత్రలు శుభ్రంగా చేసి వంటలు చేయాలని వంట చేసేటపుడు ఖచ్చితంగా ఆఫ్రాను మరియు క్యాప్ ధరించాలని అన్నారు.ప్రతి రోజూ వంట గదిని శుభ్రం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఆర్పిలు,ఎంఐఎస్ మరియు డిటిపిలు పాల్గొన్నారు.

