పర్యావరణ పరిరక్షణ పై అవగాహన గోడ పత్రికలు విడుదల
1 min read
కర్నూలు, న్యూస నేడు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్, నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ పొల్యూషన్ బోర్డ్,జిల్లా అటవీ శాఖలచే జిల్లా పరిషత్ లో జరిగిన కార్యక్రమంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ అవగాహన గోడ పత్రికలను డి.ఆర్.ఓ వెంకటరమణమ్మ, మున్సిపల్ కమిషనర్ చెల్లా ఓబులేసు,ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రీజనల్ ఆఫీసర్ కిషోర్ కుమార్, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి, నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా జనరల్ సెక్రెటరీ, నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, లయన్స్ క్లబ్ సభ్యులు లయన్ మురారి శంకరప్ప,లయన్ కె. డి. జె బాబు, లయన్ దామోదర్,భారత్ వికాస్ పరిషత్ ప్రతినిధి బాలసుబ్రమణ్యం లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

