NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్లస్టర్ … బూత్ యూనిట్ ఇన్‌చార్జిలతో విస్తృత స్థాయి సమావేశం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు  ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో SIR కార్యక్రమంపై క్లస్టర్ మరియు బూత్ యూనిట్ ఇన్‌చార్జిలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ , ఎమ్మిగనూరు శాసనసభ్యులు డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర రెడ్డి  పాల్గొని పార్టీ సంస్థాగత నిర్మాణం, బూత్ స్థాయి కార్యకలాపాల బలోపేతం, సభ్యత్వ నమోదు, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.ఈ సందర్భంగా శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ  మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి క్లస్టర్ మరియు బూత్ యూనిట్ ఇన్‌చార్జిలు కీలక భూమిక పోషించాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయడంతో పాటు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు.ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర రెడ్డి  మాట్లాడుతూ, పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్‌చార్జిలు, బూత్ యూనిట్ ఇన్‌చార్జిలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author