పోతిరెడ్డిపాడు వద్ద తెగిపోయిన గేట్ రోప్
1 min read
-పరిశీలించిన ఎమ్మెల్యే అధికారులు..
నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ 9వ ఐరన్ గేట్ రోప్ గురువారం రాత్రి తెగి కింద పడిపోవడంతో భారీ ప్రమాదం తప్పింది.విషయం తెలుసుకున్న జల వనరుల శాఖ అధికారులు మరియు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య శుక్రవారం ఉదయం పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పడిపోయిన రోప్ ను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ వంటి కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల వద్ద పరికరాల నిర్వహణ మరమ్మతులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు.రైతులకు సాగునీరు అందించడంలో పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ కీలక పాత్ర పోషిస్తుందని సాంకేతిక లోపాల వల్ల నీటి విడుదలకు ఆటంకం కలగకుండా అధికారులు తక్షణ చర్యలు చేపట్టి మూడు రోజుల్లోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రాజెక్టులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే అన్నారు.
అల్లూరులో ఫిర్యాదుల స్వీకరణ
అల్లూరులో ప్రజల నుండి ఎమ్మెల్యే అర్జీలను స్వీకరించారు.వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.


