NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

1 min read

– ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ఎస్) ఆధ్వర్యంలో విద్యార్థులు మట్టి గణపతి విగ్రహాలను తయారు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం మాట్లాడుతూ రసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా పుట్టమట్టితో తయారు చేసిన మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని సూచించారు.మట్టి గణపతి మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, మట్టిలో పుట్టి మట్టిలోనే కలిసిపోయే విగ్రహాల వల్ల చెరువులు, నదులు కలుషితం కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు. దేవుడిని పూజించడంతో పాటు ఆయన సృష్టించిన ప్రకృతిని కాపాడటమే నిజమైన భక్తి అని పేర్కొన్నారు.విద్యార్థులు తమ ఇళ్లలో కూడా స్వయంగా మట్టి గణపతి విగ్రహాలను తయారు చేసుకోవాలని, తద్వారా వారిలో సృజనాత్మకత పెంపొందడంతో పాటు మట్టి విలువను తెలుసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. అనంతరం ఉత్తమంగా తయారు చేసిన మట్టి గణపతి విగ్రహాలకు బహుమతులు ప్రకటించారు.కార్యక్రమంలో ఎన్ ఎస్ఎస్  ప్రోగ్రాం ఆఫీసర్ నవీనపాటి, అధ్యాపకులు అనంతలక్ష్మి, వెంకటరమణ, మద్దిలేటి, ముస్తాక్, ఓబులేసు, వెంకటేశ్వర్లు, శంకరయ్య, మురళీమోహన్ గౌడ్, సురేష్, వన్నూర్, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *