విత్తన సరఫరా సంస్థపైన అధికారులు తనిఖీ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: జాతీయ ఆహార భద్రత మిషన్ మరియు జాతీయ నూనెగింజల & ఆయిల్ పామ్ మిషన్ (NMEO-OS) పథకాల కింద రైతులకు సరఫరా చేయనున్న విత్తనాల నాణ్యత, పరిమాణం మరియు ప్యాకింగ్ విధానాలపై నేడు కర్నూలులోని విత్తన సరఫరా సంస్థలైన APSEEDS, NSC మరియు HIL గోదాములను అధికారులు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రైతులకు పంపిణీ చేయనున్న విత్తనాల నాణ్యత, పరిమాణం , ప్యాకింగ్, సీడ్ ట్రీట్మెంట్ రసాయనాలు మరియు సంబంధిత పంటల సాగు విధానాల బ్రోచర్లు పరిశీలించబడినవి. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత సంస్థల ప్రతినిధులకు సూచనలు జారీ చేయబడినవి.అదేవిధంగా, ప్రతి విత్తన ప్యాక్‌తో పాటు సీడ్ ట్రీట్మెంట్ కెమికల్ మరియు సంబంధిత పంట సాగు విధానాల బ్రోచర్ తప్పనిసరిగా జత చేయాలని, నాణ్యమైన విత్తనాల ప్యాకింగ్ పూర్తి చేసి, సంబంధిత ప్రాంతాలు/రైతు సేవా కేంద్రాలు (RSKలు)/మండలాలకు తక్షణమే డిస్పాచ్ చేయాలని అధికారులచే ఆదేశించబడినది.ఈ తనిఖీలలో శ్రీమతి పి.ఎల్. వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి (DAO), కర్నూలు, శ్రీ వెంకటేశ్వర్లు, సహాయ వ్యవసాయ సంచాలకులు (ADA), వ్యవసాయ కమిషనర్ & డైరెక్టర్ కార్యాలయం, గుంటూరు, శ్రీ అల్లీపిర్, వ్యవసాయ అధికారి (టెక్నికల్), జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం, కర్నూలు, శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి, కల్లూరు, అలాగే APSEEDS, NSC మరియు HIL, కర్నూలు ప్రతినిధులు పాల్గొన్నారు.



