పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలి: సిపిఐ డిమాండ్
1 min read
హోళగుందలో సిపిఐ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాల
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు
ధరలు తగ్గించకపోతే ప్రజా ఉద్యమాలు తప్పవు: బి. మారెప్ప
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సిపిఐ ఆందోళన
హోళగుందలో న్యూస్ నేడు: రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష పార్టీల పిలుపు మేరకు పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ మంగళవారం హోళగుంద మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. హోళగుంద బస్టాండ్ నుండి పాత పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి బి. మారెప్ప మాట్లాడుతూ, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపుతో సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.ఇంధన ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ప్రజల జీవనం భారంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన ధరలను తగ్గించి ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులు, కార్మికులు, ప్రజలందరూ ఏకమై కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి కె. రంగన్న, రైతు సంఘం మండల కార్యదర్శి ఎస్. కృష్ణయ్య, సిపిఐ నాయకులు అసేన్ భాషా, సలాం సాబ్, నాగేంద్ర, మరిమల్ల రాఘవేంద్ర ఆచారి, చాందు, సాబీర్, రంగస్వామి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.


