292 మంది లబ్ధిదారులకు పీఎంఏవై అర్బన్ 2.0 గృహ మంజూరు పత్రాల పంపిణీ
1 min read
పెనమలూరు , న్యూస్ నేడు: తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని 4 గ్రామాలకు చెందిన 218 మంది లబ్ధిదారులకు పీఎంఏవై అర్బన్ 2.0 పథకం కింద, అలాగే పెనమలూరు మండల పరిధిలోని 6 గ్రామాలకు చెందిన 74 మంది లబ్ధిదారులకు పీఎంఏవై అర్బన్ 2.0 పథకం కింద గృహాలు మంజూరయ్యాయి. మొత్తంగా 292 మంది గృహ లబ్ధిదారులకు గృహ మంజూరు పత్రాలను గౌరవనీయులైన పెనమలూరు శాసనసభ్యులు శ్రీ బోడె ప్రసాద్ గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.ప్రతి గృహ నిర్మాణానికి ప్రభుత్వం రూ.2,50,000/- పూర్తి సబ్సిడీగా మంజూరు చేస్తోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.1,50,000/-, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.1,00,000/- అందజేయడం జరుగుతుంది.ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ కె. శివ ప్రసాద్ గారు, అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీ అబ్దుల్ జీలానీ కార్యక్రమంలో పాల్గొన్నారు.పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎంఏవై అర్బన్ 2.0 పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు గృహ నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయం అందించబడుతోంది. ఈ కార్యక్రమంలో తాడిగడప మునిసిపాలిటీ అధ్యక్షులు అనుమోలు ప్రభాకర్ రావు రాష్ట్ర గౌడ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పీత గోపీచంద్ దుర్గ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు వెలగపూడి శంకర్ బాబు జనసేన నాయకులు రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ తాతపూడి గణేష్ బిజెపి నాయకులు ఏకుల విజయేంద్ర పెనమలూరు క్లస్టర్ ఇంచార్జ్ మారుపూడి ధన కోటేశ్వరరావు మండల పార్టీ అధ్యక్షులు కోయ ఆనందప్రసాద్ జడ వెంకటేశ్వరావు బొగ్గవరపు శ్రీనివాసరావు కొండా ప్రవీణ్ అన్నే ధన రామ కోటేశ్వరరావు అంగిరేకుల మురళి యార్లగడ్డ సుచిత్ర మల్లంపాటి విజయలక్ష్మి పాల్గొన్నారు.


