విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం
1 min read
కర్నూలు డిఎస్పీ శ్రీ రాఘవేంద్ర
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 121 ఫిర్యాదులు.
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాల మేరకు కర్నూలు డిఎస్పీ శ్రీ రాఘవేంద్ర సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 121 ఫిర్యాదులు వచ్చాయి.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …
- కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ లో నెలకు రూ. 38 వేల జీతంతో స్టాప్ నర్స్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కర్నూలు ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ లో పని చేసే ఎర్రవల్లి వేణు రూ. 5 లక్షల 50 వేలు తీసుకొని మోసం చేశాడని కర్నూలు, శ్రీరామ్ నగర్ కు చెందిన సుప్రియ చేశారు.2) పొలం ఆక్రమించుకోవాలని కొట్టి గాయపరిచిన వారి పై చర్యలు తీసుకోవాలని దేవనకొండ మండలం, తెర్నెకల్లు గ్రామానికి గిడ్డమ్మ ఫిర్యాదు చేశారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటి పై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు డిఎస్పీ శ్రీ రాఘవేంద్ర హామీ ఇచ్చారు.ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కర్నూలు డిఎస్పీ తో పాటు సీఐలు శివశంకర్, పార్థసారథి, రామకృష్ణ , ప్రవీణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

