NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  బుధవారం కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మూడో పట్టణ సీఐ శేషయ్య విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాలు, చట్టపరమైన పరిణామాలు, నార్కో టెర్రరిజం ముప్పుపై అవగాహన కల్పించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండి దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా NDPS Act-1985, ఈగల్ విభాగం చేపడుతున్న ప్రత్యేక ఆపరేషన్లు, డ్రగ్స్ సమాచారానికి ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 వినియోగంపై వివరించారు. అనంతరం విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఇంచార్జ్ డాక్టర్ అక్తార్ భాను     ,  ఈగల్ టీం హెడ్ కానిస్టేబుల్ ఎలిషా ,కానిస్టేబుల్  మాసూమ్ వలి. స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీ కోఆర్డినేటర్ శివ శంకర్  అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *