NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజల్లో ప్లాస్టిక్ కాలుష్యంపై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవం సందర్భంగా ప్రజల్లో ప్లాస్టిక్ కాలుష్యంపై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరం అని జిల్లా కోఆపపరేటివ్ సహకార బ్యాంకు సి.యి. ఓ  బాలాజీ రావు అన్నారు. అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కోఆపపరేటివ్ సహకార బ్యాంకు  వారోత్సవల్లో భాగంగా  జిల్లా కోఆపపరేటివ్ సహకార బ్యాంకు   సమావేశం భవనము లో జరిగిన అవగాహనా సదస్సు లో సి యి ఓ మాట్లాడుతూ  ఒకసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులు నేల, నీరు, గాలి కాలుష్యానికి ప్రధాన కారణంగా మారుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల జీవవైవిధ్యం దెబ్బతినడంతో పాటు పశువులు, పక్షులు మరియు జలచరాల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతోంది. ప్రతి పౌరుడు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ టి. రామకృష్ణ మాట్లాడుతూవస్త్ర సంచుల వినియోగం, పునర్వినియోగ వస్తువుల ప్రాముఖ్యత, ప్లాస్టిక్ వ్యర్థాల సరైన నిర్వహణ వంటి అంశాలపై ప్రజలకు వివరించారు. ప్రతి ఇంటి నుండి, ప్రతి విద్యాసంస్థ నుండి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే చర్యలు ప్రారంభించాలని సూచించారు. జిల్లా న్యాయ సేవధికార సంస్థ లీగల్ సర్వీస్ యూనిట్ మెంబెర్  అసోసియేషన్ ఆఫ్ అలియాన్స్ క్లబ్స్ ఇంటర్ నేషనల్ డిస్టిక్ 117 ఎస్ గవర్నర్, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ  పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌కు బదులుగా గుడ్డ సంచులు, జూట్ బ్యాగులు, స్టీల్ లేదా గాజు పాత్రలు వంటి పర్యావరణ హిత వస్తువులను ఉపయోగించాలని కోరారు. ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు మరియు ప్రజలు సమిష్టిగా కృషి చేస్తేనే ప్లాస్టిక్ కాలుష్యాన్ని సమర్థవంతంగా తగ్గించగలమని పేర్కొన్నారు.ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం   అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్  నిర్వహిస్తున్న  అంతర్జాతీయ స్థాయి గ్రీన్ పోస్టర్ కాంటెస్ట్  కరపత్రాలను  డీసీసీబీ  సీఈఓ తదితరులు ఆవిష్కరించారు.  పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో జూబ్ బ్యాగులు మరియు బట్ట సంచులను  బ్యాంకు ఉద్యోగస్తులందరికీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో  డిసిసిబి బ్యాంక్  మేనేజర్  రామాంజనేయులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పవన్ కుమార్, కమ్యూనిటీ ప్రాజెక్టు  ఎన్విరాన్మెంట్ క్యాంపెయిన్లో  భాగంగా రాయపాటి మార్దవ్ తదితరులు పాల్గొన్నారు.

About Author