NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాలుడిని క్షేమంగా  తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

1 min read

హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద గ్రామానికి చెందిన హరివనం నాగరాజు కుమారుడు గోవర్ధన్ (13), హొలగుంద మండలం ఇంగల్‌దహల్ గ్రామంలోని బీసీ హాస్టల్‌లో ఉంటూ 8వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 4వ తేదీ సాయంత్రం పాఠశాల ముగిసిన అనంతరం తన స్నేహితులతో బయటకు వెళ్లి వస్తానని చెప్పి హాస్టల్ నుంచి వెళ్లిన గోవర్ధన్ తిరిగి హాస్టల్‌కు రాలేదు.దీంతో హాస్టల్ వార్డెన్, వాచ్‌మన్‌లు వెంటనే హోళగుంద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న హోళగుందఎస్‌ఐ దిలీప్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు. రాత్రంతా పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టడంతో పాటు, బాలుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.ఈ క్రమంలో గోవర్ధన్ కే. బెలగల్ క్యాంపు సమీపంలో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని బాలుడిని క్షేమంగా గుర్తించారు. అనంతరం అతడిని హోళగుందకు తీసుకువచ్చి అతని తల్లిదండ్రులకు అప్పగించారు.ఈ సందర్భంగా బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పోలీసుల తక్షణ స్పందన, అప్రమత్తత, నిరంతర గాలింపు చర్యల వల్ల తమ కుమారుడు క్షేమంగా లభించాడని హొలగుంద పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.ప్రజలు తమ పిల్లల కదలికలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు ఎదురైనా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని హొలగుంద పోలీసులు సూచించారు.

About Author