NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజల దాహానికి పరిష్కారం… గ్రామాభివృద్ధికి శ్రీకారం

1 min read

ముత్తుకూరులో నూతన తాగునీటి పైప్‌లైన్ ప్రారంభం

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గ ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న టీడీపీ ఇంచార్జ్  వైకుంఠం జ్యోతి నాయకత్వంలో, మాజీ ఇంచార్జ్ శ్రీ వైకుంఠం శివప్రసాద్ సహకారంతో, ఆస్పరి సింగిల్ విండో డైరెక్టర్ ముత్తుకూరు మల్లికార్జున నేతృత్వంలో ముత్తుకూరు గ్రామంలో నూతన తాగునీటి పైప్‌లైన్ ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీటి సరఫరాను ప్రారంభించారు.గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఈ కార్యక్రమం చేపట్టడం హర్షణీయమని గ్రామస్థులు తెలిపారు. ఈ పైప్‌లైన్ ద్వారా గ్రామంలోని అనేక కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ, ఈ కార్యక్రమానికి సహకరించిన వైకుంఠం జ్యోతి, వైకుంఠం శివప్రసాద్ మరియు ముత్తుకూరు మల్లికార్జునకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలూరు ఐటీడీపీ నాయకులు జితేంద్ర కుమార్, గ్రామ ఉపాధ్యక్షుడు శివారెడ్డి, బూత్ ఇంచార్జిలు వీరనాయుడు, మద్దిలేటి, విజయ్, బత్తిని లోకప్ప, వడ్డే పరమేష్, మునిస్వామి, బత్తిని ప్రకాష్, ఉప్పర పరమేష్, గొల్ల పులికొండ నల్లారెడ్డి, మునెప్ప, వడ్డే మంగన్న, రాము, రామాంజి, గ్రామ కమిటీ సభ్యులు, మహిళలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author