గదగ్‌లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈబీజీ గోవింద్ గౌడ్‌కు ఘన సన్మానం
1 min read
హొళగుంద న్యూస్ నేడు: కర్ణాటక రాష్ట్రంలోని గదగ్ పట్టణంలో ఉన్న పవిత్ర శ్రీ పుట్టరాజ గవాయి మఠంలో ఉభయ గురువుల జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక సేవా కార్యక్రమాల్లో సమాజ సేవలో విశేష కృషి చేస్తున్న ప్రముఖులను మఠ పీఠాధిపతి పరమపూజ్య శ్రీ కలయ్యజ్జ శాలువా, జ్ఞాపిక (షీల్డ్)తో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈబీజీ గోవింద్ గౌడ్‌కు ప్రత్యేక గౌరవం దక్కడం విశేషంగా నిలిచింది.సమాజ సేవ, పేద ప్రజలకు అండగా నిలవడం, అన్నదాన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సేవలు, ప్రజాహిత కార్యక్రమాల్లో నిరంతరం ముందుండి సేవలందిస్తున్న ఈబీజీ గోవింద్ గౌింద్ గౌడ్ సేవలను పీఠాధిపతి ప్రత్యేకంగా కొనియాడారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఆయన చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని ప్రశంసించారు.ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీ కలయ్యజ్జ మాట్లాడుతూ, “సమాజ సేవే నిజమైన దైవసేవ. సేవా భావంతో ప్రజలకు అండగా నిలిచే వ్యక్తులు సమాజానికి ఆదర్శం. మీరు ఇదే సేవా స్ఫూర్తితో మరింత విస్తృతంగా ప్రజలకు సేవలందించాలని, భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు, శక్తి, విజయాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అని ఆశీర్వదించారు.ఈ సందర్భంగా ఈబీజీ గోవింద్ గౌడ్ మాట్లాడుతూ, తనకు లభించిన ఈ గౌరవం వ్యక్తిగతంగా తనకే కాకుండా తనను ప్రోత్సహిస్తున్న ప్రజలకు, పార్టీ నాయకులకు, అభిమానులకు మరియు సేవా కార్యక్రమాల్లో తనతో పాటు నడుస్తున్న ప్రతి ఒక్కరికీ చెందుతుందని అన్నారు. సమాజ సేవనే తన జీవిత ధ్యేయంగా భావిస్తూ భవిష్యత్తులో కూడా మరింత అంకితభావంతో ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు.ఈ అరుదైన సన్మానం ఈబీజీ గోవింద్ గౌడ్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధతకు, మానవతా దృక్పథానికి దక్కిన గొప్ప గుర్తింపుగా పలువురు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో మఠ ప్రముఖులు, భక్తులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సేవాభావం కలిగిన ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఈబీజీ గోవింద్ గౌడ్‌ను అభినందించారు. భవిష్యత్తులో కూడా ఆయన ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

