NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సర్ -2026 పై సమీక్షా సమావేశం

1 min read

ఎస్సీ కార్పొరేషన్ ఈడి ఎం. ముక్కంటి

ఏలూరు జిల్లా ప్రతినిధి, న్యూస్ నేడు: ఏలూరు/కైకలూరు,నెం.73 కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం నకు చెందిన నియోజకవర్గ స్థాయి  అన్ని రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులతోనూ, నాలుగు మండలాల AERO&తహశీల్దార్ ల తోనూ శుక్రవారం   కైకలూరు తాహశీల్దార్ కార్యాలయం నందు SIR-2026 పై సమీక్షా సమావేశము నిర్వహించడమైనదని కైకలూరు నియోజకవర్గం ఈఆర్ఓ మరియు ఎస్సీ కార్పొరేషన్ ఈడి ఎం. ముక్కంటి చెప్పారు.  ఈ సందర్భంగా ముక్కంటి మాట్లాడుతూ ASD లిస్టు లను మండల స్థాయి పార్టీ నాయకులకు అందజేయడమైనదని, BLA లు అందరూ బిఎల్​ఓ,  లకు సహాయకులుగా వుండవలసినదిగా  తెలియజేయడమైనదన్నారు.      తాత్కాలిక వలసదారు ఓటర్లను మరియు జాడ తెలియని ఓటర్లను (Absent) త్వరితముగా తిరిగి (రేపటిలోగా) రప్పించి, SIR ఎన్యుమరేషన్ పనిని పూర్తి చేయుటకు సహకరించాలన్నారు.  నిజమైన ఓటర్లు 2002 ఓటరు జాభితాతో పోల్చలేని వారిని ఎన్నికల కమిషన్ వారు తెలిపిన  ఆధార పత్రములతో EF ఫారం లు పూర్తి చేయవలసినదిగా తహశీల్దార్లకు ఆదేశించడమైనదన్నారు. 11 వ తేది లోగా తాత్కాలిక వలసఓటర్లు  మరియు జాడ తెలియని ఓటర్లు (Absent) అందరూ వారి బిఎల్​ఓ,  ల వద్ద మీ పూర్తి సమాచారం తో EF ఫారం ల పై సంతకం చేయవలసినదిగా తెలియజేయదమైనదన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *