బాధితులకు బీసీవై పార్టీ అధినేత సంఘీభావం
1 min read
40 ఏళ్లు గడచినా న్యాయం చేయకపోవడం సిగ్గుచేటు
నందికొట్కూరు న్యూస్ న్యూడ్ నేడు: 40 సంవత్సరాలు గడిచినా శ్రీశైలం ముంపు నిర్వాసితులకు న్యాయం చేయకపోవడం చాలా సిగ్గుచేటని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో గత 107 రోజులుగా శ్రీశైలం ముంపు బాధితులు రిలే నిరాహార దీక్షకు రామచంద్ర యాదవ్ మద్దతు తెలుపుతూ శుక్రవారం ఉదయం సంఘీభావం తెలిపారు. నిర్వాసితులు,ప్రజా సంఘాలతో కలిసి పట్టణంలో ర్యాలీ చేపట్టారు.దీక్ష వద్ద రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ బాధితులకు పూర్తి న్యాయం వారి సమస్యలను పరిష్కరించేంత వరకు బాధితులకు బీసీవై పార్టీ అండగా ఉంటుందని అన్నారు.1981లో సుమారు 41 గ్రామాల ప్రజలు లక్ష 10వేల ఎకరాల భూమిని రైతులు శ్రీశైలం ప్రాజెక్టు కోసం తమ భూములను ఇస్తే 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రతి ఇంటికీ ఉద్యోగం ఇస్తామని 98 జీవో జారీ చేశారని అప్పటి నుండి ఇంతవరకు ఎంతోమంది ముఖ్యమంత్రి మారినా బాధితుల సమస్యలు మాత్రం పరిష్కరించకపోవడం చాలా సిగ్గుచేటు అని నిర్వాసితులపై ఎంత చిత్తశుద్ధి ఉందనేది అర్థం అవుతోందని అన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ,సిపిఐ ఎంఎల్,విద్యార్థి సంఘాల నాయకులు వెంకటేశ్వర్లు,రమేష్,రఘురాం మూర్తి,శేఖర్,నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు జయన్న తదితరులు పాల్గొన్నారు.


