NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

99.97 శాతం ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశాం

1 min read

74.18 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి

ప్రతి రాజకీయ పార్టీ బూత్ స్థాయి ఏజెంట్ ను నియమించుకోవాలి

కొత్తగా 134 పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదనలు

స్థల మార్పిడికి 45, పేరు మార్పులకు 13 పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదనలు

జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

నంద్యాల, న్యూస్​ నేడు : ఎస్ఐఆర్ (ఓటర్ల జాబితా సమగ్ర సవరణ) ప్రక్రియలో భాగంగా 99.97 శాతం ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశామని తిరిగి ఇచ్చిన ఫారాలను 74.18 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి రాజకీయ పార్టీ ప్రతినిధులకు వివరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎస్ఐఆర్ (ఓటర్ల జాబితా సమగ్ర సవరణ)పై రాజకీయ పార్టీ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో డిఆర్ఓ రామునాయక్, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు బిజెపి పార్టీ ప్రతినిధి కె.చంద్రశేఖర్, టిడిపి పార్టీ ప్రతినిధి ఎం.రామ్మోహన్, వైఎస్సార్సీసీపీ పార్టీ ప్రతినిధి సాయిరామ్ రెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి ప్రదీప్, జనసేన పార్టీ ప్రతినిధి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ (ఓటర్ల జాబితా సమగ్ర సవరణ) ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి రాజకీయ పార్టీ ప్రతినిధులు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని రాజకీయ పార్టీ ప్రతినిధులకు కలెక్టర్ సూచించారు. బిఎల్ఓ, బిఎల్ఎ సమన్వయంతో పని చేయడం ద్వారా ఓటర్లకు ఎస్ఐఆర్ పై అవగాహన కల్పిస్తూ త్వరితగతిన పూర్తి అయ్యే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో 1200 ఓటర్లకు మించి ఉండకూడదనే నిబంధనలో భాగంగా కొత్తగా 134 పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందన్నారు.జిల్లాలో ఇప్పటి వరకూ 1629 పోలింగ్ కేంద్రాలు ఉండడం జరిగిందని వాటిలో ఆళ్లగడ్డలో 298 పోలింగ్ కేంద్రాలు ఉండగా కొత్తగా 14 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు (పోలింగ్ కేంద్రాల స్థల మార్పిడికి 9) మొత్తంగా 312 పోలింగ్ కేంద్రాలు అవుతాయని, శ్రీశైలంలో 226 పోలింగ్ కేంద్రాలు ఉండగా కొత్తగా 13 కొత్త పోలింగ్ కేంద్రాలు చేయగా (స్థల మార్పిడికి 8, పేరు మార్పిడికి 5) మొత్తంగా 239 అవుతాయని, నందికొట్కూరులో 251 పోలింగ్ కేంద్రాలు ఉండగా కొత్తగా 25 పోలింగ్ కేంద్రాలు చేయగా (స్థల మార్పిడికి 1, పేరు మార్పిడికి 2) మొత్తంగా 276 అవుతాయని, నంద్యాలలో 286 పోలింగ్ కేంద్రాలు ఉండగా కొత్తగా 48 కొత్త పోలింగ్ కేంద్రాలు చేయగా (స్థల మార్పిడికి 20, పేరు మార్పిడికి 6) మొత్తంగా 334 అవుతాయని, బనగానపల్లెలో 277 పోలింగ్ కేంద్రాలు ఉండగా కొత్తగా 29 కొత్త పోలింగ్ కేంద్రాలు చేయగా మొత్తంగా 306 అవుతాయని, డోన్ లో 291 పోలింగ్ కేంద్రాలు ఉండగా కొత్తగా 5 కొత్త పోలింగ్ కేంద్రాలు చేయగా (స్థల మార్పిడికి 7) మొత్తంగా 296 అవుతాయని రాజకీయ పార్టీ ప్రతినిధులకు కలెక్టర్ వివరించారు. అదే విధంగా ఏ ఒక్క పోలింగ్ కేంద్రాలు కూడా ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *