అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
1 min read
నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు, న్యూస్ నేడు: శుక్రవారం నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. శుక్రవారం ఆయన బళ్లారి చౌరస్తా ఆంజనేయస్వామి ఆలయం వెనుక నిర్మిస్తున్న నూతన రహదారి, వై. జంక్షన్ కూడలి అభివృద్ధి పనులను పరిశీలించారు.అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. బళ్లారి చౌరస్తా వద్ద ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఆంజనేయస్వామి ఆలయం వెనుక రూ.1.45 కోట్లతో 120 మీటర్ల మేర నూతన రహదారి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని, ఈ నెలాఖరులోగా వాటిని పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అలాగే రూ.54 లక్షల ఎన్‌క్యాప్ నిధులతో వై.జంక్షన్ కూడలిని అభివృద్ధి చేస్తున్నామని, మరో రెండు నెలల్లో పనులు పూర్తవుతాయని చెప్పారు.అంతకన్నాముందు శ్రీనగర్ కాలనీ, మాధవి నగర్, నంద్యాల చెక్‌పోస్ట్, వై.జంక్షన్, వీకర్ సెక్షన్ కాలనీ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పరిమళ నగర్ అన్న క్యాంటీన్‌ను అకస్మిక తనిఖీ చేశారు.కార్యక్రమంలో టీఏఈ ఖాసిం వలి, సానిటరీ ఇంస్పెక్టర్లు హుస్సేన్, ఆలీం బాష, కాంట్రాక్టర్ మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

