జనాభా నియంత్రణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: పెరుగుతున్న జనాభా ప్రపంచ అభివృద్ధిపై ప్రభావం చూపుతోందని లయన్స్ జిల్లా గవర్నర్ అడ్వైజర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అన్నారు.ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ ల సంయుక్త ఆధ్వర్యంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి మెమోరియల్ మున్సిపల్ హై స్కూలు నందు జరిగిన అవగాహన కార్యక్రమం మరియు వ్యాసరచన పోటీల విజేతల బహుమతుల ప్రధాన కార్యక్రమంలో లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ ప్రతి కుటుంబ బాధ్యత అని అన్నారు. రిటైర్డ్ జిల్లా గనులు మరియు భూగర్భ శాస్త్ర శాఖ ఉపసంచాలకులు లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ఉపాధ్యక్షులు లయన్ తాళ్లపాక నటరాజ మాట్లాడుతూ కుటుంబ ఆరోగ్య పరిస్థితిని మించి పిల్లలను కనడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందన్నారు. చిన్న కుటుంబం సంతోషకర కుటుంబం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.ప్రజలకు కుటుంబ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ ప్రాజెక్టు రాయపాటి మార్దవ్ పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


