NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లీజు పేరుతో సోలార్ కంపెనీ చేస్తున్న మోసాన్ని అరికట్టాలి

1 min read

రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. ప్రభాకర్ రెడ్డి 

హోసూరు జోలపురం పెద్దహుల్తి రైతులను మోసం చేసిన సోలార్ కంపెనీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. రైతు సంఘం కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి  జి రామకృష్ణ

లీజు కాలంలో భూములపై పూర్తి హక్కులు రైతులకే ఉండాలి కర్నూలు జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు 

న్యూస్ నేడు, పత్తికొండ:  లీజు పేరుతో సోలార్ కంపెనీ లు చేస్తున్న మోసాలను అరికట్టాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పత్తికొండ పట్టణంలోని స్థానిక కొత్త బస్టాండ్ నుండి పెద్ద ఎత్తున రైతులు సోలార్ కంపెనీ మోసాలను అరికట్టాలని ర్యాలీ నిర్వహించారు. అనంతరం తాసిల్దార్ ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైతు సంఘం మండల కార్యదర్శి సిద్దయ్య గౌడ్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ప్రభాకర్ రెడ్డి జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ జిల్లా అధ్యక్షులు  వెంకటేశ్వర్లు జిల్లా నాయకులు పి .సూరి లు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా సోలార్ మెగా పవర్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీలు పవర్ విండో సహస్ర ప్రాజెక్టులు కంపెనీలు ప్రభుత్వాలను కూడా కన్నుగప్పి రైతులను నట్టేట ముంచుతున్నారని రైతులకు ఎలాంటి అగ్రిమెంట్ ముందస్తు తెలుపకుండా రైతులతో గ్రామసభలు నిర్వహించకుండా చర్చించకుండా భూసేకరణ చట్టానికి విరుద్ధంగా  గుడ్డిగా సంతకాలు పెట్టించుకుని మధ్యవర్తుల ద్వారా భూముల హక్కులను కోల్పోయే విధంగా లీజు పత్రాలను సృష్టించుకుని రైతులను మోసం చేస్తున్న కంపెనీలపై వెంటనే ఉన్నతాధికారులు చర్యలు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *