NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముగిసిన జిల్లా స్థాయి యోగా పోటీలు

1 min read

యోగ పోటీల బాలుర ఛాంపియన్ ఇండస్ జట్టు,బాలికల కేశవరెడ్డి పాఠశాల జట్టు

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు జిల్లా యోగ సంఘం ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా యునైటెడ్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి యోగా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ లో బాలుర విభాగంలో ఇండస్ పాఠశాల జట్టు ఓవరాల్ ఛాంపియన్ గా నిల్వగా బాలికల విభాగంలో కర్నూల్ లోని కేశవరెడ్డి పాఠశాల జట్టు కైవసం చేసుకుంది. బాలుర విభాగంలో రెండవ స్థానంలో పెద్దపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మూడవ స్థానంలో రిడ్జ్ పాఠశాల,పెరవలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జట్టు కైవసం చేసుకుంది. బాలికల విభాగంలో రెండవ స్థానంలో ఆదోని లీలాస్ హైస్కూల్, మూడవ స్థానంలో మాంటి ఇంటర్నేషనల్ స్కూల్,ఏథెనా ఇంగ్లీష్ మీడియం స్కూల్ జట్టు, నిలిచాయి.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి యునైటెడ్ క్లబ్ అధ్యక్షులు వై.భీమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గెలుపొందిన విద్యార్థులకు ప్రశంస పత్రాలతో పాటు వ్యక్తిగత బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనం నుండే విద్యార్థులు చదువులో రాణించాలంటే యోగా సాధన చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోటీల అబ్జర్వర్ శ్రీనివాసులు, యునైటెడ్ క్లబ్ గేమ్స్ కార్యదర్శి చెన్నకేశవ రాజు,జిల్లా యోగ సంఘం అధ్యక్ష కార్యదర్శులు అవినాష్ శెట్టి,మునిస్వామి,జిల్లా యోగ సంఘం సభ్యులు కేశవ,గంగాధర్,అక్బర్, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *