NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ భక్త కనకదాస విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ఘన ఆహ్వానం

1 min read

మధాసి మాదారి కురువ సంఘం నాయకుల ఆహ్వానం – సమాజ సేవలో ముందుండే నాయకుడిగా గోవింద్ గౌడ్ సేవలను కొనియాడిన సంఘ ప్రతినిధులు

హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండలంలోని మధాసి మాదారి కురువ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 19-07-2026 (ఆదివారం) నిర్వహించనున్న శ్రీ భక్త కనకదాస విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు ఈబీజీ గోవింద్ గౌడ్ను సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, భక్త కనకదాస మహనీయుడు సమాజంలో సమానత్వం, సోదరభావం, భక్తి మార్గాన్ని ప్రజలకు చాటిచెప్పిన గొప్ప సంస్కర్త అని కొనియాడారు. ఆయన ఆశయాలను భావితరాలకు చేరవేసే లక్ష్యంతో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండి సేవలందిస్తున్న నాయకుడిగా, అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించిన ఈబీజీ గోవింద్ గౌడ్ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆశీర్వదించాలని సంఘ ప్రతినిధులు కోరారు.ఆహ్వానాన్ని స్వీకరించిన ఈబీజీ గోవింద్ గౌడ్ మాట్లాడుతూ, శ్రీ భక్త కనకదాస మహనీయుని సేవలు సమాజానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, పరస్పర గౌరవాన్ని పెంపొందిస్తాయని అన్నారు. తనపై చూపిన అభిమానానికి సంఘ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ నెల 19న జరిగే విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి తప్పకుండా హాజరై కార్యక్రమ విజయవంతానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.మధాసి మాదారి కురువ సంఘం నాయకులు మాట్లాడుతూ, ఈ మహోత్సవానికి అన్ని గ్రామాల ప్రజలు, యువత, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ ఆహ్వాన కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు దర్గాన, బోజప్ప, రామలింగ పూజారి, నల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *