NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్ టి యు టెట్ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకోండి

1 min read

ఎస్ టి యు సీనియర్ నాయకులు కొత్తపల్లి సత్యనారాయణ. 

న్యూస్ నేడు, పత్తికొండ:  ఎస్ టి యు తయారుచేసిన టెట్ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్ టి యు సీనియర్ నాయకులు కొత్తపల్లి సత్యనారాయణ నిరుద్యోగ డీఎస్సీ అభ్యర్థులకు సూచించారు. గురువారం పత్తికొండ స్థానిక ఎస్టియు ప్రాంతీయ కార్యాలయంలో పత్తికొండ మండలం ఎస్టియు అధ్యక్షుడు ఆవుల నాగరాజు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి , ఎస్ టి యు సీనియర్ రాష్ట్ర నాయకులు సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు చంద్ర శేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్టీయూ తయారు చేసిన ఎస్టియు టెట్ మెటీరియల్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్టియు సీనియర్ నాయకులు సత్యనారాయణ మాట్లాడుతూ, కేవలం 100 రూపాయలకు మాత్రమే ఈ పుస్తకాన్ని ఉపాధ్యాయులకు అందించాలనే సదుద్దేశంతో ఈ మెటీరియల్ తయారు చేయడం జరిగిందని ఆయన అన్నారు. భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఉపాధ్యాయులందరికీ జీవన్మరణ ఉద్యమ సమస్యగా మారిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఉత్తీర్ణత కోసం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి, చట్ట సవరణ కొరకు, ఆఫ్లైన్ పరీక్ష కొరకు, కనీస అర్హత మార్కులు తగ్గింపు కొరకు ప్రాతినిధ్యం చేస్తూ మరొకవైపు, ఉపాధ్యాయులను ఉత్తీర్ణతవైపు సన్నద్ధత చేయాలనే తలంపుతో విషయ నిపుణుల అందరితో సంప్రదించి తయారు చేసినటువంటి ఎస్టియు టెట్ మెటీరియల్ కు అద్భుతమైన స్పందన రావడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *