NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

20 నుండి ఎంపీఈఓ’ల సమ్మె బాట

1 min read

ఉద్యోగ భద్రత,జీతాలు పెంచాలి

గత 12 ఏళ్లుగా అరకొర జీతాలే..

నందికొట్కూరు న్యూస్ నేడు: గత 12 సంవత్సరాల నుండి అరకొర జీతాలతోనే మా కుటుంబాలను నెట్టుకొస్తున్నామని ఇప్పటికైనా మజితాలను పెంచాలని వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఎంపీ ఈవోల ఆవేదన..నంద్యాల జిల్లా నందికొట్కూరు డివిజన్ లో ఉన్న నందికొట్కూరు, మిడుతూరు, జూపాడుబంగ్లా,పగిడ్యాల మండలాల్లో ఉన్న ఎంపీఈవోలు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 20 నుండి 26వ తేదీ వరకు వారు సమ్మెబాట నిర్వహిస్తున్నట్లు డివిజన్ కమిటీ నాయకులు రాముడు,సలాం భాష, సుధాకర్,అఖిల్,అమృత తెలిపారు.గురువారం పట్టణంలో ఏడిఏ కార్యాలయంలో మండల వ్యవసాయ అధికారి షేక్షావలికి సమ్మెకు అనుమతి ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 12 ఏళ్ల నుండి 15వేల రూపాయలతోనే మా కుటుంబాలను పోషిస్తున్నామని అన్నారు. మాకు ఇంతవరకు ఉద్యోగ భద్రత జీతాలు పెంచలేదని డివిజన్,జిల్లా మరియు రాష్ట్రస్థాయిలో సమ్మె నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.

ఎంపీఈవో ల డిమాండ్లు

గత 5 నెలలుగా రాని జీతాలు విడుదల చేయాలి. 35 వేలు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈహెచ్ఎస్ హెల్త్ కార్డు ద్వారా ఉచితవైద్యం, ప్రమాద బీమా, ఉద్యోగినులకు చైల్డ్ కేర్ సెలవులు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వేణు భాయ్,ఝాన్సీ, షహనాజ్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *