ఆత్మకూరులో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” ప్రత్యేక కార్యక్రమం
1 min read
ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కరించాలి…
జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్
ఆత్మకూరు, న్యూస్ నేడు: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలమేరకు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు “వన్ మంత్ ఫోర్ విజిట్” కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమం ద్వారా అధికారులు ప్రజలకు మరింత చేరువై వారి సమస్యలను పరిష్కరించేందుకు ఇది చక్కని అవకాశం అని జిల్లా ఎస్పీ తెలిపారు. నేడు శ్రీశైలం నియోజకవర్గం లోని వెలుగోడు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా. రాజశేఖర్ రెడ్డి , నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా , జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ , జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ , మరికొందరు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అధికారులు వారి వారి శాఖల వారీగా ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి ఫిర్యాదులు స్వీకరించి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తారని భరోసా కల్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… పోలీసు శాఖకు సంబంధించిన ఫిర్యాదులను చట్టపరిధిలో చట్టప్రకారం అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి, నిర్దేశిత గడువులోగా పరిష్కరిస్తామని భరోసా కల్పిస్తూ ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో విచారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.



