NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రెచ్చగొట్టే విషయాలు పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్

1 min read

సోషల్ మీడియాలో కులాలను మతాలను రెచ్చగొట్టొద్దు

నందికొట్కూర్ రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం..

నందికొట్కూరు న్యూస్ నేడు: సోషల్ మీడియాలో కులాలను,మతాలను రెచ్చగొట్టే విషయాలను పోస్ట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు నందికొట్కూరు రూరల్ సీఐ టి.సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సందర్భంగా సీఐ శుక్రవారం మాట్లాడుతూ కులాలను,మతాలను రెచ్చగొట్టే విషయాలను పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ సలాం(అబ్దుల్ సలాం)అనే వ్యక్తి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని హిందువులు గురువారం జూపాడుబంగ్లాలో ధర్నా చేసిన సంగతి తెలిసిందే. నందికొట్కూరు సంగయ్య పేటకు చెందిన సాలివేరి వెంకటేష్ ఫిర్యాదు మేరకు మహమ్మద్ సలాం పై కేసు నమోదు చేసి శనివారం కోర్టులో హాజరు పరచగా నిందితుడికి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించినట్లు అదేవిధంగా నిందితుడి మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.హిందూ దేవుళ్ళ గురించి అవమానకరంగా అసభ్యకరంగా పోస్ట్ చేసిన ఫేస్బుక్ ఐడి ఆధారంగా దర్యాప్తు చేయగా నిందితుడు జూపాడుబంగ్లాలో రేషన్ షాప్ నడుపుతున్నాడని అన్నారు.వర్గాలను మరియు దేవుళ్లపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఎంతటి వారినైనా ఉపయోగించేది లేదని రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం అన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *