నాన్ లోని రైతులకు 31 వ తేదీ ఇన్సూరెన్స్ పెంపు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కల్లూరు మండలము పర్ల గ్రామము లో రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ మీద అవగాహన కల్పించడం జరిగినది.నాన్ లోని రైతులకు కూడా ఈ నెల 31 తేదీ వరకు పొడిగించబడింది.కావున రైతులందరూ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.అలాగే బ్యాంకు లో లోను తీసుకున్న రైతులు బ్యాంకు లోనే క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు.క్రాప్ లోనూ తీసుకున్న రైతులు బ్యాంకు ద్వారా ఇన్సూరెన్స్ పొందవచ్చని, నాన్లోని రైతులు కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ప్రతి రైతు కచ్చితంగా తప్పనిసరిగా పంటల బీమా చేయించుకోవాలని క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకున్న రైతు పంట నమోదు తప్పని సరిగా చేయించుకోవాలని తెలియజేయడమయినది. ఇందులో భాగంగా మండల వ్యవసాయ అధికారి శ్రీ డి. విష్ణు వర్ధన్ రెడ్డి కల్లూరు పర్ల గ్రామ వ్యవసాయ సహాయకులు ప్రవీణ్ మరియు రైతులు పాల్గొనడం జరిగినది.


