హోలగుంద బీసీ కాలనీలో ఎస్ఐఆర్ ఓటర్ల నమోదు కార్యక్రమం విజయవంత
1 min read
హోళగుందన్యూస్ నేడు: హోళగుంద మండలంలోని బీసీ కాలనీలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఓటర్ల నమోదు కార్యక్రమం విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది చాణిక్య, కో క్లస్టర్ రారావి సిద్దు, 41వ బూత్ కన్వీనర్ ఆర్. అభిషేక్ పాల్గొని ఓటరు నమోదుపై ప్రజలకు అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని, వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని సూచించారు.ఇంకా ఓటరు నమోదు చేసుకోని వారు లేదా గ్రామంలో లేని అర్హులైన ఓటర్ల సమాచారం తెలిసిన వారు వెంటనే సంబంధిత బూత్ స్థాయి బాధ్యులకు తెలియజేయాలని కోరారు. ఓటరు నమోదు ప్రక్రియకు ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు ఉన్నందున ప్రతి అర్హుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బీసీ కాలనీ పెద్దలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


