ముఖ్యమంత్రి బహిరంగ సభ విజయవంతానికి టీడీపీ సన్నాహక సమావేశం
1 min read
హోళగుంద న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి మండల కేంద్రంలో ఈ నెల 25వ తేదీ శనివారం నిర్వహించనున్న రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభను చారిత్రాత్మక విజయంగా నిలపాలనే లక్ష్యంతో హొలగుంద మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎల్ఎల్సీ గెస్ట్ హౌస్లో నిర్వహించిన సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది.ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సభకు భారీ సంఖ్యలో ప్రజలను తరలించడం, గ్రామాల వారీగా బాధ్యతల కేటాయింపు, రవాణా ఏర్పాట్లు, కార్యకర్తల సమన్వయం, ప్రచార కార్యక్రమాలు, సభ నిర్వహణలో పాటించాల్సిన విధివిధానాలపై విస్తృతంగా చర్చించారు.సభను విజయవంతం చేయడంలో ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ శ్రేణులంతా సమిష్టిగా కృషి చేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి సభ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు నిదర్శనంగా నిలిచేలా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని నాయకులు సూచించారు.ఈ సందర్భంగా జిల్లా, మండల, గ్రామ కమిటీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, దేవాలయ కమిటీ చైర్మన్లు, క్లస్టర్ ఇన్చార్జులు, యూనిట్ ఇన్చార్జులు, బూత్ ఇన్చార్జులు, కో-ఇన్చార్జులు, పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, మహిళా నాయకులు, క్రియాశీల కార్యకర్తలు, అభిమానులు, తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో హాజరై సభ విజయవంతానికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించారు.సమావేశాన్ని విజయవంతం చేసిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు, పార్టీ శ్రేయోభిలాషికి నిర్వాహకులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ముఖ్యమంత్రి బహిరంగ సభను ఆలూరు నియోజకవర్గ చరిత్రలో నిలిచిపోయే విధంగా అత్యంత భారీ స్థాయిలో విజయవంతం చేయాలని, ప్రతి గ్రామం నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభకు విజయకేతనం ఎగరవేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశం అనంతరం పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొనగా, ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లలో ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయిలో నిమగ్నమై విజయవంతం చేయాలని నాయకులు ఆకాంక్షించారు.



